మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీపీఎం నేత బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డితో పాటు పలువురు నేతలు హాస్పిటల్ కు వెళ్లారు. మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి విషమంహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరికొద్ది సేపట్లో మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేయనున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలియడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.