ఆలుగడ్డల మాటున గంజాయి, ఆపై ఏం జరిగింది ?

ఆలుగడ్డల మాటున గంజాయి, ఆపై ఏం జరిగింది ?

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆలుగడ్డల మధ్యలో గంజాయి ప్యాకెట్లను పెట్టి డీసీఎంలో తరలిస్తున్న గ్యాంగ్ కి చెందిన ముగ్గురిని శంషాబాద్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు తెలిపారు. మహారాష్ట్రకి చెందిన నౌషద్, సలీం (38), షేక్ రెహన్(25), షేక్ వాసీం (38), ఒడిశాకు చెందిన సంతోష్ ఐదుగురు గ్యాంగ్ గా ఏర్పడి గంజాయి సప్లయ్ చేసేవారు. ఆలుగడ్డల మాటున గంజాయి, ఆపై ఏం జరిగింది ?

ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు, అమరావతికి హైదరాబాద్ సిటీ మీదుగా గంజాయిని తరలించేవారు. శుక్రవారం డీసీఎంలో ఆలుగడ్డల మధ్యలో 560 కిలోల గంజాయి ప్యాకెట్లను పెట్టి ఒడిశా నుంచి ఈ గ్యాంగ్ మహారాష్ట్రాకు బయల్దేరింది. శనివారం ఓఆర్ఆర్ మీదుగా హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్దకు చేరుకోగానే శంషాబాద్ జోన్ పోలీసులు డీసీఎంను ఆపి తనిఖీలు చేశారు. ఆలుగడ్డల లోడ్ మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఆలుగడ్డల మాటున గంజాయి, ఆపై ఏం జరిగింది ?డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. డీసీఎంకి ముందు వెళ్తున్న ఓ కారును సైతం అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు సప్లయర్స్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 1 కోటి 30 లక్షలు ఉంటుందని, ప్రధాన నిందితులు నౌషద్ , సంతోష్ పరారీలో ఉన్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. కేసును ఛేదించిన శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ జోన్ ఎస్ ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డిని అభినందించారు.