ఏపీ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

వరంగల్ : ఏపీ ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. బ్రేక్ పట్టేయడంతో ఎస్-6 బోగి నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించి అప్రమత్తమైన రైలు డ్రైవర్ నెక్కొండ స్టేషన్ లో రైలును నిలిపివేశారు. దీంతో భయాందోళనకు గురైన కొంతమంది ప్రయాణికులు రైల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వీరిని చూసిన స్టేషన్లోని ప్రయాణికులు సైతం వామ్మో అంటూ భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించి రైలును పంపించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.