గోదావరి ఎక్స్ ప్రెస్ కు మరోసారి తప్పిన ప్రమాదం

గోదావరి ఎక్స్ ప్రెస్ కు మరోసారి తప్పిన ప్రమాదం

గోదావరి ఎక్స్ ప్రెస్ కు మరోసారి తప్పిన ప్రమాదంవరంగల్ టైమ్స్, సికింద్రాబాద్ : గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు మరోసారి ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఓ బోగీ నుంచి పొగలు రావడం అలజడి రేపింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలును మౌలాలి స్టేషన్‌లో నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. అనంతరం రైలు తిరిగి బయల్దేరి వెళ్లింది. గడిచిన నెల రోజుల్లో గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఇది రెండో ప్రమాదం కావడం కలవరపాటుకు గురిచేసింది.
అయినప్పటికీ ప్రమాదం ఏమీ జరుగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.