మంత్రి సత్యవతి రాథోడ్ కి పితృ వియోగం

మంత్రి సత్యవతి రాథోడ్ కి పితృ వియోగంవరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా: మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం ఉదయం మృతిచెందాడు. మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తండ్రి మరణవార్త తెలియడంతో ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయల్దేరారు.