జీడబ్ల్యూఎంసీలో పాము కలకలం..

జీడబ్ల్యూఎంసీలో పాము కలకలం..

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది. కార్యాలయంలోని ప్రధాన హాల్ వద్ద నాగుపాము హల్ చల్ చేసింది. కార్యాలయంలోనికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. జీడబ్ల్యూఎంసీలో పాము కలకలం..దీంతో కార్యాలయ సిబ్బంది పాములు పట్టే వ్యక్తి యాకోబును పిలిపించారు. అనంతరం పాములు పట్టే వ్యక్తి కార్యాలయానికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో వదిలేశారు. దీంతో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.