గ్రామపంచాయతీలు స్వతంత్రంగా ఎదగాలి : మంత్రి

గ్రామపంచాయతీలు స్వతంత్రంగా ఎదగాలి : మంత్రి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : గ్రామపంచాయతీలు కేవలం పన్నుల మీద, ప్రభుత్వాలు ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా, స్వతంత్రంగా ఎదిగే విధంగా ఆలోచించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ లోని షాపింగ్ కాంప్లెక్స్ ని మంత్రి ప్రారంభించారు.గ్రామపంచాయతీలు స్వతంత్రంగా ఎదగాలి : మంత్రిగ్రామ పంచాయతీ నిధులు, 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ తో పర్మినెంట్ ఆదాయ మార్గం ఏర్పడటమే కాకుండా, బస్టాండ్ కి అందం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.