బీజేపీకి టీఆర్ఎస్ సెగలు..ఊరూవాడా నిరసనలు

బీజేపీకి టీఆర్ఎస్ సెగలు..ఊరూవాడా నిరసనలుఉమ్మడి వరంగల్ జిల్లా : అన్నదాతల కోసం టీఆర్ఎస్ పోరును ఉధృతం చేస్తోంది. వడ్ల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడంతో పాటు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోయని మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు నిరసన బాటపట్టింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువలు వెల్లువెత్తాయి.

ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఊరూరా ధర్నాలు, దిష్టబొమ్మల దహనాలు, చావు డప్పులతో శవయాత్రలు చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు దిగారు. ఎక్కడికక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని నిరసనలను విజయవంతం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులు పడుతున్న కష్టాలను నిరసన కార్యక్రమాల్లో వివరిస్తూ బీజేపీ వైఖరిని ఎండగట్టారు.