బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైన హంసానందిని

బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైన హంసానందినిహైదరాబాద్ : తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైంది. తన కెరీర్ లో తెలుగు సినిమాల్లో ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించింది. గతంలో కరోనా మహమ్మారి బారినపడి పూర్తిగా కోలుకున్న హంసానందిని కొన్ని నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి కావడంతో సినిమాలకు దూరమైంది. తాను బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైనట్లు హంసానందిని వెల్లడించింది.

క్యాన్సర్ చికిత్సలో భాగంగా హంసానందినికి ప్రస్తుతం కీమో థెరపీ, రేడియేషన్ చేస్తున్నారు. అయితే త్వరలోనే కోలుకుని సినిమాల్లోకి తిరిగి వస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొన్నేండ్ల క్రితం హంసానందిని తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించారని వైద్యులు తెలిపారు. వివిధ పరీక్షలు చేసిన తర్వాత హంసానందినికి కూడా ఆమె తల్లి నుంచి వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు తేలిందని చెప్పారు. ఏదేమైనా హంసానందిని త్వరగా క్యాన్సర్ బారినుంచి కోలుకుని తిరిగి సినిమాల్లోకి రావాలని ఆశిద్ధాం.