హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి షాక్

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి షాక్మండి : బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభాసింగ్ , బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్ పై గెలుపొందారు.

దాదాపు 10 వేల ఓట్ల తేడాతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్ , ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కీ నుంచి సంజయ్, జుబ్బల్ నుంచి రోహిత్ ఠాకూర్ లు గెలుపొందారు.