కోహ్లీ కూతురుపై అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు

కోహ్లీ కూతురుపై అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులున్యూఢిల్లీ : టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘోరమైన పరాభవం పొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు, న్యూజిల్యాండ్ చేతిలో కూడా టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ, 9నెలల కూతురు వామికపై కూడా అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే కోహ్లీ కూతురు వామిక ఫోటోల కోసం ఎదురుచూస్తున్నామని, అవి బయటపడిన తన్వాత ఆ పాపపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు.

అయితే వీటిపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది. ఈ బెదిరింపులను సుమోటోగా తీసుకుంది. ఈ బెదిరింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, గుర్తించిన నిందితులు, వారిలో అరెస్టైన వారి వివరాలు కూడా అందించాలని డిప్యూటీ కమిషనర్ ను కోరింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలను వివరిస్తూ నవంబర్ 8 లోగా నివేదిక సమర్పించాలని కోరింది.