ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదు : హరీష్ రావు

ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదు : హరీష్ రావుహైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజురాబాద్ లో కాంగ్రెస్ , బీజేపీ కలిసి పని చేశాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లే చెబుతున్నారన్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్ లో రాష్ట్రస్థాయిలో కుమ్మక్కుకవడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ పేరుపేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమి తగ్గలేదన్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికతో కుంగిపోదని, గెలిచిన నాడు పొంగిపోలేదన్నారు. ఓడినా, గెలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని మంత్రి స్ఫష్టం చేశారు.