హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపుకరీంనగర్ జిల్లా : ఉత్కంఠ పోరు మధ్య హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరిగింది. మొదటి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ చూపిస్తూ వచ్చారు. అయితే 8, 11 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఐనప్పటికీ ఓవరాల్ లీడ్ లో ఈటల రాజేందర్ రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు.

22 రౌండ్లు పూర్తయ్యాక ఓవరాల్ గా 23వేల 655 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో 7వ సారి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా హుజురాబాద్ నుంచి గెలుపొందారు. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.