నీట్-2021లో టాపర్ గా హైదరాబాద్ కుర్రాడు

నీట్-2021లో టాపర్ గా హైదరాబాద్ కుర్రాడున్యూఢిల్లీ : నీట్ -2021 ఫలితాలు రిలీజయ్యాయి. వీటిలో హైదరాబాద్ కుర్రాడు మృనాల్ కుట్టేరి టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీకి చెందిన తృణమూల్ తన్మయ్ గుప్తా, ముంబైకి చెందిన కార్తీక జి నాయర్ నిలిచారు. ఈ ముగ్గురూ కూడా నీట్ పరీక్షలో 720 కి 720 మార్కులు సాధించారు.

అమ్మాయిల్లో టాపర్ గా కార్తీక నిలిచింది. కేరళలో పుట్టిన ఆమె ముంబైలోనే పెరిగింది. తెలంగాణకు చెందిన యువతి శరణ్య కూడా టాప్ 100లో స్థానం దక్కించుకుంది. కోరుట్లకు చెందిన ఈ విద్యార్థిని 60వ ర్యాంకులో నిలిచింది.