అక్కడ 3 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు

అక్కడ 3 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతుకోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో 4 స్థానాల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఉపపోరులో 4 నియోజకవర్గాలకు గాను 3 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మంగళవారం ట్వీట్ చేశారు.

ఉపఎన్నికల్లో రెండవ, మూడల స్థానం కోసం బీజేపీ , సీపీఎంల మధ్య హోరాహోరీ పోరు సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగాల్ ప్రజలు విద్వేష రాజకీయాలను విస్మరించి అభివృద్ధి రాజకీయాలకు పట్టం కట్టారని సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఉపఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన ఓటర్లకు మమతా ధన్యవాదాలు తెలిపారు.