వాహనాలను సీజ్ చేయవద్దు: స్టీఫెన్ రవీంద్ర

వాహనాలను సీజ్ చేయవద్దు: స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, వాహనాల జప్తు విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను, ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు.

న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు సీజ్‌ చేయొద్దన్నారు. ఈ మేరకు శనివారం కమిషనరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్లో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు, సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి కృషి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ అవగాహన సమావేశాలు పెంచాలన్నారు. పాదచారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్‌ సిబ్బంది వారికి సహకరించాలన్నారు.