ఏపీలో అతి భారీ వర్షాలు పడే అవకాశం

ఏపీలో అతి భారీ వర్షాలు పడే అవకాశంవిశాఖపట్నం: ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం బలపడనుంది. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనించనుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.

రాగల 3 రోజుల వాతావరణ సమాచారం

శనివారం : శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా ,గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

ఆదివారం: శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

సోమవారం :శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.