​ ఎయిర్​పోర్టుకు దక్కిన అరుదైన గౌరవం

​ ఎయిర్​పోర్టుకు దక్కిన అరుదైన గౌరవంహైదరాబాద్ : జీఎమ్మార్​ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ( GHIAL​)కు తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాలు 2020 (TSECA)లో ప్రతిష్టాత్మక స్వర్ణ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇంధన పరిరక్షణలో ‘గేయిల్​ ’తీసుకున్న అద్భుతమైన కార్యక్రమాలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలోని అక్షర హాలులో ఇంధన పొదుపు వారోత్సవాల చివరి రోజు పరిశ్రమ ప్రముఖుల మధ్య డీ ప్రభాకరరావు, సీఎండీ ట్రాన్స్‌కో మరియు జెన్‌కో, తెలంగాణ మరియు సందీప్ కుమార్ సుల్తానియా, సెక్రటరీ, పీఆర్ అండ్ ఆర్డీ, అందజేసిన అవార్డును గేయిల్​ సీనియర్ అధికారులు ఆదివారం అందుకున్నారు. తమ రోజువారీ కార్యకలాపాలలో ఇంధన పొదుపు రీత్యా ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పురోగతిని అవలంబించే సంస్థలను ఈ వార్షిక ఫోరం గుర్తిస్తుంది.​ ఎయిర్​పోర్టుకు దక్కిన అరుదైన గౌరవం న్యాయనిర్ణేతలు ఈ పోటీలో పాల్గొన్న సంస్థలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను వినూత్న ఆలోచన ప్రక్రియలను పరిశీలించారు. ‘ఈ పురస్కారం ఇంధన పొదుపు, పర్యావరణ సుస్థిరత విషయంలో మా నిబద్ధతకు నిదర్శనం. సామాజిక బాధ్యతాయుత సంస్థగా మేము ఉత్తమ ఇంధన పొదుపు చర్యలకు కట్టుబడి ఉన్నాము. గేయిల్​ ఇంధన, జల సంరక్షణ కార్యక్రమాలు అనేక పరిశ్రమ వేదికల మీద గుర్తించబడ్డాయి. అయితే తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఈ గుర్తింపు వాటిలో చాలా ప్రత్యేకమైనది.’ అన్నారు ప్రదీప్​ పణికర్​ సీఈవో గేయిల్​.