భారత్‌ను తాకిన కొత్త కరోనా స్ట్రెయిన్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కొత్త కరోనా స్ట్రెయిన్ భారత్‌ను తాకింది. నిన్న రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు, చెన్నై లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను అధికారులు పరిశీలనలో ఉంచారు. లండన్ తో ప్రయాణ సంబంధమున్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా సోకినవారి నమూనాలను పరిశోధన కోసం ఎన్‌సీడీసీకి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) పంపినట్లు అధికారులు తెలిపారు.