ఏపీ సర్కార్‌ అప్రమత్తం

ఏపీ సర్కార్‌ అప్రమత్తంఅమరావతి : బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త రకం వైరస్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. పాజిటివ్ పేషెంట్లను కొవిడ్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. నెగిటివ్ వచ్చిన వారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని, ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాల సేకరణ పనిలో అధికారులు ఉన్నారు.