ఉమారామలింగేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన దాస్యం

ఉమారామలింగేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మహా శివుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని సందర్శించారు. ఉమారామలింగేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన దాస్యంఆలయానికి వచ్చిన చీఫ్ విప్ దాస్యం దంపతులను ఆలయ అర్చకులు, అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు వేయిస్తంభాల రుద్రేశ్వరున్ని దర్శించుకుని అభిషేకం జరిపారు. రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.ఉమారామలింగేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పించిన దాస్యంతదనంతరం వడ్డేపల్లి చెరువు కట్టపై నిలిచిఉన్న ఉమా రామలింగేశ్వర స్వామిని వినయ్ భాస్కర్ దంపతులు దర్శించుకున్నారు. శివపార్వతుల కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా శివుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతున్ని ప్రార్థించినట్లు చీఫ్ విప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈరోజు సాయంత్రం వేయి స్తంబాల దేవాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని శివాలయాలలో అధికారికంగా వేదపండితుల మధ్య శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని శివపార్వతుల కళ్యాణంను భక్తులందరూ కనులారా వీక్షించాలని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.