ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణస్వీకారం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, దండే, టీ భానుప్రసాద్, విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత మండలిలోని తన చాంబర్ లో చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ , వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.