ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో అధికార పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.