భారత్ లో కొత్తగా 975 కరోనా కేసులు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది కోలుకున్నారు. 5,21,747 మంది మరణించారు. కాగా గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. 796 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.ఇక రికవరీ రేటు 98.74 శాతం ఉందని, మరణాలు 1.21 శాతం, యాక్టివ్ కేసులు 0.03 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,86,38,31,723 కరోనా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో శుక్రవారం 6,89,724 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు ప్రకటించింది.