హైదరాబాద్ లో చిరుజల్లులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. చిరుజల్లులతో హైదరాబాద్ సిటీ అంతా చల్లబడింది. దీంతో నగర ప్రజలు ఉక్కపోత నుంచి రిలాక్స్ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎండ లేకపోయినప్పటికీ ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సికింద్రాబాద్, చిలకలగూడ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, మారేడ్ పల్లి, బేగంపేట, బోయిన్ పల్లి, పద్మారావు నగర్, బషీర్ బాగ్ లతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.హైదరాబాద్ లో శనివారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఐతే రాబోయే ఒకట్రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దుండిగల్, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట్ , ఝారాసంఘం ప్రాంతంలో వర్షం కుండపోతగా కురిసింది.