రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షం 

రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల వల్ల ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి పేర్కొన్నారు.రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో వర్షం రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడ్రోజులు అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శ్రావణి వెల్లడించారు.