ఏపీలో ప్రారంభమైన ఒంటిపూట బడులు 

ఏపీలో ప్రారంభమైన ఒంటిపూట బడులు

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ఉదయం 7.30 నుంచి 11.30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లల్లోకి పంపాలని సూచించారు.

పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ కావడంతో పాఠశాలల యాజమాన్యాలు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఈ నెల 27 నుంచి మే 9వ వరకు పదో తరగతి, మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.