ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు 

ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నెల 9 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. వివిధ విభాగాల్లో 12 పోస్టుల నియామకాలను చేపట్టింది. ఇందులో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఏజీఎం, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జీఎం వంటి స్కేల్ 2,3,4,5,6,7 మేనేజర్ పోస్టులున్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.ఐపీపీబీలో మేనేజర్ ఉద్యోగాలు 

మొత్తం పోస్టులు : 12
సీనియర్ మేనేజర్ 2, చీఫ్ మేనేజర్ 4 , చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ , ఏజీఏం, చీఫ్ మేనేజర్, జీఎం, సీనియర్ మేనేజర్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, ఎంబీఏలో ఏదో ఒక విద్యనభ్యసించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 150
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 9
వెబ్ సైట్ : www.ippbonilne.com