లోక్ సభలో వాకౌట్..రాజ్యసభలో పెట్రో లొల్లి 

లోక్ సభలో వాకౌట్..రాజ్యసభలో పెట్రో లొల్లి

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు నేడు రాజ్యసభలో లొల్లి సృష్టించి, సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. నేడు రెండు సార్లు రాజ్యసభను వాయిదా వేశారు. వెల్ లోకి దూసుకువెళ్లిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నా, విపక్షాలు చర్చకు పట్టుపట్టాయి.లోక్ సభలో వాకౌట్..రాజ్యసభలో పెట్రో లొల్లి దీంతో 2 గంటల వరకు డిప్యూటీ చైర్మన్ సస్మిత్ పాత్ర సభను వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. ఇక ఇదే పెట్రో అంశంపై నేడు లోక్ సభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, శివసేన పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. వెల్ లోకి దూసుకెళ్లిన డీఎంకే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.