అమూల్​తో ఒప్పందం మహిళలకు మేలు: వైఎస్​ జగన్​

అమూల్​తో ఒప్పందం మహిళలకు మేలు: వైఎస్​ జగన్​అమ‌రావ‌తి ‌: అమూల్‌తో ఒప్పందం వల్ల మహిళలకు మేలు కలుగుతుందని, పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ ‌రెడ్డి అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు. అమూల్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు సభలో ఉంటారని తాము ఆశించామని కానీ ఆయన మాత్రం స్వప్రయోజనాలు చూసుకున్నారని విమర్శించారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. సభ నుంచి సస్పెండ్‌ చేయించుకుని త‌న అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. జులై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్‌ పెంచుతామని హామీ ఇచ్చారు. 2023 జూలై 8న రూ.2,750 నుంచి రూ.3వేలకు పింఛన్​ పెంచుతామని ప్రకటించారు.