అమరావతిపై చర్చ బీఏసీలో ఎందుకు పెట్టలేదు?: బొత్స

అమరావతిపై చర్చ బీఏసీలో ఎందుకు పెట్టలేదు?: బొత్స

అమ‌రావ‌తి : శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్ధేవా చేశారు. అమరావతిపై చర్చించాలని అనుకున్నప్పుడు బీఏసీలో ఎందుకు పెట్టలేదని మంత్రి ప్రశ్నించారు. బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. పబ్లిసిటీ కోసం టీడీపీ అమరావతి అంటోందని అమరావతి గురించి చర్చించడానికి తమకు భయం లేదన్నారు. టీడీపీకి రాజకీయ లబ్ది‌కావాలి కానీ సమస్య పరిష్కారం కాదన్నారు. ఏ విషయంపైనా అయినా చర్చించడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు.