‘భీమ్లా నాయక్’ వేడుక వాయిదా..కారణం ఇదే

'భీమ్లా నాయక్' వేడుక వాయిదా..కారణం ఇదేవరంగల్ టైమ్స్, హైదరాబాద్: విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్సు అంగీకరించడం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదని జననేత చెప్పారు. అందుకే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ వేడుక త్వరలోనే జరుగుతుందని, వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందని వెల్లడించారు.