టీవీ, సినీ నటుడు సిద్ధార్థ శుక్లా ఇకలేరు

టీవీ, సినీ నటుడు సిద్ధార్థ శుక్లా ఇకలేరుముంబై : టీవీ, సినిమా నటుడు సిద్ధార్థ శుక్లా గుండెపోటుతో గురువారం మృతిచెందారు. ఆయన వయస్సు 40 ఏళ్లు. బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ శుక్లా.. షోబిజ్ తో పాపులర్ అయ్యారు. హింప్టీ శర్మాకే దుల్హనియా చిత్రంలో ఆయన నటించారు. గురువారం ఉదయం శుక్లాకు గుండెపోటు వచ్చింది దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

సిద్ధార్థ శుక్లా మరణించినట్లు కైపర్ హాస్పిటల్ ధ్రువీకరించింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే 3 లాంటి షోల్లో కనిపించాడు. బాలికా వధు ( చిన్నారి పెళ్లి కూతురు) , దిల్ సే దిల్ తక్ టీవీ సీరియళ్లలో నటించారు. జలక్ దిక్లాజా6, ఫియర్ ఫ్యాక్టర్- ఖత్నోంకా ఖిలాడి లాంటి రియాల్టీ షోల్లోనూ నటించారు.