యావజ్జీవ జీవిత ఖైదీగా గొర్రెకుంట హత్యల దోషి

యావజ్జీవ జీవిత ఖైదీగా గొర్రెకుంట హత్యల దోషివరంగల్ అర్బన్ జిల్లా : మైనర్ గర్ల్ పై లైంగిక దాడికి పాల్పడ్డ ముద్దాయి సంజయ్ కుమార్ కి వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టు జీవితకాల జైలు శిక్ష ఖరారు చేసింది. మే 25, 2020 న రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట మండలం జాన్ పాక ఆదర్శనగర్ జిన్నింగ్ మిల్లులో ఉన్న 9 మందికి అన్నంలో మత్తు పదార్థం కలిపి సజీవంగా వ్యవసాయ బావిలో పడవేసి హత్యచేసిన ఘటనలో ముద్దాయి అయిన సంజయ్ కుమార్ కి తేదీ.28.10.20 న ఇదే కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రఫీక అనే వివాహితను లైంగికంగా వాడుకొని ఈమె కూతురు (మైనర్) పై మనసు పడి, ఇదే సంవత్సరం మార్చి నెలలో నడుస్తున్న రైలు నుండి రఫీకను తోసివేసి హత్యచేసి అడ్డుతొలగించుకున్నాడు. ఈ కేసులో తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు గీసుగొండ పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం పోలీసుల సమాచారం మేరకు సంజయ్ కుమార్ పై గీసుగొండ పోలీసులు మర్డర్ కేసు గా నమోదు చేసారు. ప్రస్తుతం ఇట్టి కేసు విచారణ దశలో సంజయ్ కుమార్ దోషిగా తేలడంతో పాటు బాలికపై కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడటంతో గర్భవతి అయింది. ఈ కేసు విచారణలో సంజయ్ కుమార్ పై గీసుగొండ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. కేసు విచారణలో సంజయ్ కుమార్ దోషిగా తేలడంతో జీవిత కాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. నేరస్తునికి జైలు శిక్ష పడేందుకు ప్రత్యేక శ్రద్ద కనబరిచిన ఇన్చార్జ్ డీసీపీ వెంకటలక్ష్మి, మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్ లతో పాటు గీసుగొండ కోర్టు కానిస్టేబుల్ లింగయ్య లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.