ఎల్బీ నగర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

ఎల్బీ నగర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజిద్ , రాగులు విజేందర్ , ఎండీ మీర్జా అక్బర్, ఎండీ పాషా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుడు అన్న చంద్ పాషా , హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు తమ్ముడు షఫీ మధ్య పశువుల కొనుగోలు, ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి వేల కత్తులు, కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.ఎల్బీ నగర్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్చాంద్ పాషా, షఫీ సోదరులు పాతికేళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నారు. కోటి రూపాయల లావాదేవీలకు సంబంధించి వీరి మధ్య వివాదం నడుస్తున్నది. ఈక్రమంలో ఎండీ షఫీ, అతని అనుచరులు ఆరుగురితో కలిసి బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆటోలో ఎల్బీనగర్ లోని చాంద్ పాషా ఇంటికి చేరుకున్నారు. వెంటతెచ్చుకున్న ఇనుప రంపంతో తలుపులను కోశారు. చాంద్ పాషా, అతని భార్య సాబీరా, బావమరిది ఖలీల్ పై కారంపొడి చల్లి కత్తులు, ఇనుప రంపంతో దాడిచేశారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే రక్తపుమడుగుల్లో ప్రాణాలు కోల్పోయారు.

అక్కడే ఉన్న చాంద్ పాషా కూతురు రూబీనా చంపొద్దని బాబాయి షఫీని బ్రతిమిలాడింది. హీనాను వదిలేసిన షఫీ మరో గదిలో పడుకున్న చాంద్ పాషా కొడుకులు ఫహద్, సమద్ పై కూడా దాడికి దిగారు. ఇద్దరూ తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరైన ఖలీల్ ది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం. మంగళవారం వరంగల్ వచ్చి ఇంటికి వెళ్తుండగా రైలు మిస్సయ్యింది. దీంతో సోదరి సాబీరా ఇంట్లో ఉన్నాడు. ఈక్రమంలో షఫీ చేతుల్లో హత్యకు గురయ్యాడు.