సాయంత్రం నుంచి ఆన్లైన్ లో ఆర్జిత సేవా టికెట్లు 

సాయంత్రం నుంచి ఆన్లైన్ లో ఆర్జిత సేవా టికెట్లు

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మార్చి, ఏప్రిల్‌, మే నెలల కోటాను బుధవారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. అదే విధంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇది కొనసాగుతుంది.