డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ 12 మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు పూరీ జగన్నాథ్ విచారణకు వచ్చారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం.