శాశ్వత డోనర్ గా వద్దిరాజు ప్రమాణస్వీకారం

ములుగు జిల్లా : మేడారం మహాజాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తనవంతుగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మేడారం మహాజాతరకు శాశ్వత డోనర్ గా నియమించబడటం పట్ల వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. మేడారం మహాజాతరకు శాశ్వత డోనర్ గా నియమించబడిన వద్దిరాజు రవిచంద్ర శనివారం మేడారంకు చేరుకున్నారు.శాశ్వత డోనర్ గా వద్దిరాజు ప్రమాణస్వీకారం

సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై శనివారం మేడారంలో జరిగిన మంత్రులు, అధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికై మేడారం చేరుకున్న సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు వద్దిరాజు రవిచంద్ర పుష్పగుచ్ఛం అందచేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతర పరిసర ప్రాంతాలు, జంపన్న వాగు, జాతర ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులను అధికారులు, మంత్రులతో కలిసి పరిశీలించారు.

అనంతరం సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మేడారం మహాజాతర ఏర్పాట్లపై, నిర్వహణపై సుదీర్ఘంగా సమీక్షించారు.శాశ్వత డోనర్ గా వద్దిరాజు ప్రమాణస్వీకారం

ఈ సందర్భంగా దేవాదాయ అధికారులు వద్దిరాజు రవిచంద్రతో అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మేడారం మహాజాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న వద్దిరాజు రవిచంద్రను మంత్రులు, అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.