ములుగు జిల్లా : తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు జిల్లా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది.
ఈ ఎదురు కాల్పుల్లో మడకం సింగే అలియాస్ శాంత అలియాస్ అనిత ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీలో పని చేసి ప్రస్తుతం వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తుంది. మరో మావోయిస్టు నేత కొమ్ముల నరేష్ అలియాస్ బుచ్చన్న సైతం మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. అయితే మూడో వ్యక్తి ని మాత్రం ఇంకా గుర్తించలేదు.