40లో 20లా కనిపించాలంటే ?

40లో 20లా కనిపించాలంటే ?

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా మహిళలకు అందంగా కనిపించాలని ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వయస్సు మీద పడుతున్నా కొద్దీ అందం తగ్గుతుంది. కొందరి ముఖంపై వయస్సు చారలు కనిపిస్తాయి. కళ్ల చుట్టు నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే చర్మం మునుపటిలా యవ్వనంగా కనిపించదు. 40లోనూ మీరు 20 లా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే చాలు. చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడానికి, మీరు చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవాలి. కాబట్టి 40 ఏళ్ల వయస్సులో ఏయే చర్మ సంరక్షణ చిట్కాలను పాటించాలో తెలుసుకుందాం.40లో 20లా కనిపించాలంటే ?

1. కేవలం పగటి పూటనేకాదు, రాత్రికూడా చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం, క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ కాకుండా, మీరు సీరం, ఫేస్ ఆయిల్, షీట్ మాస్క్‌లను కూడా ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి హైడ్రేషన్ పుష్కలంగా అందుతుంది. చర్మం మెరుస్తూ ఉంటుంది. మీరు మార్కెట్లో ప్రొడక్టులను ఎంచుకునేముందు మీ చర్మంలో కొల్లాజెన్ ను పెంచె ప్రొడక్టులను ఎంచుకోవాలి.

2. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, యాంటీ ఏజింగ్ క్రీమ్‌ను రోజుకు కనీసం రెండుసార్లు చర్మానికి రాయాలి. మీ స్కిన్ టోన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు సహజ వస్తువులు ఉపయోగించిన ప్రొడక్టులను సెలక్ట్ చేసుకోండి. మీరు యాంటీ ఏజింగ్ సీరం, షీట్ మాస్క్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఈ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

3. చర్మం యవ్వనంగా ఉండటానికి ఎల్లప్పుడూ మసాజ్ చేయాలి. మసాజ్ చేయడానికి మీరు మీ చేతులను రోలర్‌గా ఉపయోగించండి. అలాగే, మసాజ్ చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా ఫేస్ ఆయిల్‌ని ఉపయోగించాలి. తద్వారా తేమ అలాగే ఉంటుంది. చర్మానికి సంబంధించిన సమస్యలు ఉండవు.