కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం ఆగమైతది: KTR

కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం ఆగమైతది : కేటీఆర్

కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం ఆగమైతది: KTR

వరంగల్ టైమ్స్, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలోని వీరన్న పల్లి మండలంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. గిరిజన మండలంలో పర్యటించిన కేటీఆర్ ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ భవనం నిర్మిస్తామన్నారు. మండల కేంద్రంలో బంజారా భవనం కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాసుపత్రులపై పాటలు పాడుకున్న పరిస్థితిని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ఇప్పుడు కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే మహిళలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. అసైన్డ్ భూములకు చట్టబద్దత కల్పించి పట్టాలిచ్చి వాటిని తమ అవసరాలకు అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టుకునేందుకు సౌలభ్యం కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్, రైతు భీమా ఇచ్చారా అని ప్రజలను ప్రశ్నించారు కేటీఆర్. కానీ బీఆర్ఎస్ పాలనలో 24గంటలు కరెంట్, నీళ్లు, రైతు బంధు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటలు కరెంట్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ రైతులకు ఏమైనా చేసిందా, ఒక్క రూపాయి అయినా రైతుల ఖాతాలో జమ చేసిందా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ మొత్తం రూ.19,445 కోట్లకు గానూ రూ.14,000 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదు వేల కోట్లు కూడా నెల రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ధరణి వద్దు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తానని కాంగ్రెస్ నాయకులు గతంలో చెప్పిన మాటలకు గడ్డి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. పట్వారీ వ్యవస్థ వస్తే దళారులు విజృంభిస్తారని తెలిపారు. 55ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఈ గ్రామంలో మంచిగా స్కూళ్లను నిర్మించుకున్నాం. మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని అభివ‌ృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్.