కోడి పందాల స్థావరాలపై దాడులు..9 మంది అరెస్ట్

కోడి పందాల స్థావరాలపై దాడులు..9 మంది అరెస్ట్జయశంకర్ భూపాలపల్లి జిల్లా : పోలీసుల కళ్లుగప్పి మనం దామెరకుంట గ్రామపంచాయతీ పరిధిలోని కట్కుపల్లి శివార్లలో గత రెండ్రోజులుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, విస్తృత ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు.

ఈ హెచ్చరికలతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా భావించిన పందెంరాయుళ్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం దామెరకుంట గ్రామపంచాయతీ పరిధిలోని కట్కుపల్లి శివార్లలోని రహస్య ప్రదేశంలో కోడి పందాలను నిర్వహించారు. సమాచారం అందుకున్న క్రైం అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కోడి పందాల స్థావరాలపై మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న సుమారు 9 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 కోళ్లు, 6 ద్విచక్రవాహనాలు, 6 సెల్ ఫోన్లు, రూ.7150 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, వ్యక్తులను తదుపరి చర్య కోసం ఎస్ హెచ్ఓ కాటారంకు అప్పగించినట్లు తెలిపారు.