4వ రోజు రైతు బంధు నిధులు రూ.1144 కోట్లు

4వ రోజు రైతు బంధు నిధులు రూ.1144 కోట్లుహైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా విడుదలైన రైతుబంధు నిధుల జమ 4వ రోజు సజావుగా జరిగింది. 4వ రోజు రైతు బంధు నిధులు రూ.1144 కోట్లను జమ చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు 6,75,824 మంది రైతుల ఖాతాల్లో నగదు జమైంది. ఇప్పటివరకు 52,71,091 మంది రైతులకు రైతుబంధు నిధులు అందాయి. మొత్తం రూ.4246 కోట్లను రైతుబంధు నిధుల కోసం పంపిణీ చేస్తన్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

సీఎం సూచనలతో మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. డిమాండ్ ఉన్న పంటల సాగుకు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ సలహాలు ఇస్తుంన్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తామన్నారు. అనంతరం సీజన్ కు ముందు సాగు చేయాల్సిన పంటల వివరాలను రైతులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇతర పంటల్లో భాగంగా నూనెగింజల, పప్పు సాగు మరింత పెరగాలని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.