రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ విషెష్

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ విషెష్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామన్నారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు. అన్ని వర్గాలు ప్రగతిపథంలో పురోగమించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.