నగరంలో భారీ అగ్నిప్రమాదం..10 గుడిసెలు దగ్ధం

నగరంలో భారీ అగ్నిప్రమాదం..10 గుడిసెలు దగ్ధంహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ కు సమీపంలో వేసుకున్న ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఈ మంటలు మరో 9 గుడిసెలకు వ్యాపించాయి.

దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ గుడిసెల్లో నివాసముంటున్న వారంతా చెత్త ఏరే వ్యక్తులని పోలీసులు నిర్ధారించారు. అదృష్టవశాత్తు వీరంతా కట్టుబట్టలతో బయటపడ్డారు.