కొండా స్వయంకృతాపరాధం! 

కొండా స్వయంకృతాపరాధం!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వైఎస్ జమానాలో ఓ వెలుగు వెలిగిన మహిళా నేతల్లో కొండా సురేఖ ఒకరు. కొండా దంపతులపై అభిమానంతో సురేఖకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు వైఎస్. దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లాపై పట్టు సాధించే ప్రయత్నం చేశారామె. కానీ వైఎస్ మరణంతో కొండా ఫ్యామిలీకి కష్టకాలం మొదలైంది. వాళ్ల దూకుడుకు సడెన్ గా స్పీడ్ బ్రేకులు పడ్డాయి.కొండా స్వయంకృతాపరాధం! *కొండాకు జనం గట్టి గుణపాఠం చెప్పారా !
అంతా జై తెలంగాణ అంటే కొండా దంపతులు మాత్రం వైసీపీ పంచన చేరారు. అంతేకాదు పరకాల నుంచి ఏకంగా రాజీనామా చేసి వైసీపీ నుంచి బరిలో నిలిచారు కొండా సురేఖ. బలమైన తెలంగాణవాదాన్ని అణిచివేసే కుట్రలో భాగస్వాములయ్యారు. కానీ ప్రజలు మాత్రం గూబ గుయ్ మనే తీర్పు ఇచ్చారు. కొండాను ఓడించి రాజకీయాల్లో అతివిశ్వాసం పనికిరాదని జనం గట్టి గుణపాఠం చెప్పారు.

*కొండా యూటర్న్ ఫలించింది..
ఆ తర్వాత సడెన్ గా యూటర్న్ తీసుకున్నారామె. వైసీపీ నుంచి షిఫ్ట్ అయిపోయి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కొంతకాలం ఉన్నారో లేదో ఏకంగా కారెక్కారు. పరకాల టికెట్ ను సాధించి అక్కడి నుంచి పోటీ చేశారు. ఒకప్పుడు కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన ఆమె, అదే కేసీఆర్ ను పొగుడుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో పింక్ హవా వీయడంతో ఆ ఊపులో ఈజీగా గెలిచేశారు కొండా సురేఖ.

కొండా స్వయంకృతాపరాధం! 

*అయ్యో కొండా లాజిక్ మిస్ అయ్యారా!
కాంగ్రెస్ రాజకీయానికి, గులాబీ పార్టీలో రాజకీయానికి పొంతనే ఉండదు. ఆ లాజిక్ మిస్ అయ్యారు కొండా సురేఖ. టీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ తరహా రాజకీయం చేశారు. మంత్రి పదవి వచ్చేస్తుందంటూ క్యాడర్ ముందు గొప్పలు చెప్పుకున్నారు. అసలే అవినీతి ఆరోపణలు, కొండా మురళి దూకుడు ఇవన్నీ పసిగట్టే టీఆర్ఎస్ పెద్దలు ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కొండా మురళికి ఎమ్మెల్సీతో సరిపెట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి మంత్రిపదవి ఆశతోనే కాలం వెళ్లదీశారు. దీంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.

*కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని కొండా నిలబెట్టుకోలేదా !
టీఆర్ఎస్ లో పదవులకు టఫ్ కాంపిటిషన్ ఉంటుంది. ఉద్యమ పార్టీ. అందులోనూ వరంగల్. పార్టీకి ముందునుంచి పనిచేసిన వారిని కాదని సీఎం కేసీఆర్, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గౌరవమే ఇచ్చారని చెప్పాలి. కానీ కొండా ఫ్యామిలీ మాత్రం దానిని నిలుపుకోవడంలో విఫలమైంది. తమ గురించి ఎక్కువ ఊహించుకుంది. ఒంటెద్దు పోకడలతో రాజకీయం చేసే ప్రయత్నం చేశారు కొండా దంపతులు. కేసీఆర్ ముందు కుప్పిగంతులు వేస్తే ఏం జరుగుతుందో చివరికి అదే జరిగింది. 2018 ఎన్నికలకు వచ్చే సరికి వరంగల్ ఈస్ట్ సీటును చివరి వరకు పెండింగులో పెట్టారు సీఎం కేసీఆర్. ఎన్నికల సీజన్ కాబట్టి ఆశావహులకు కూడా నచ్చచెప్పాల్సి ఉంటుంది. పార్టీలో ముందునుంచి ఉన్న వారిని కూడా సముదాయించాలి. అందుకే ఈస్ట్ సీటును పెండింగ్ లో పెట్టారట.కొండా స్వయంకృతాపరాధం! 

కానీ కొండాసురేఖ మాత్రం తనకు టికెట్ వచ్చే వరకు వెయిట్ చేసేంత ఓపిక కూడా లేకుండా ఎప్పటిలాగే మళ్లీ పార్టీ మార్చేశారు. అధికార పార్టీలో ఉంటే ఈస్ట్ నుంచి మరోసారి ఆమె ఈజీగా విజయం సాధించేవారు. కేసీఆర్ బొమ్మతో ఆమె సునాయసంగా విజయఢంకా మోగించే పరిస్థితి ఉండేది. కానీ కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా.. ఓపిక లేకుండా కాంగ్రెస్ లోకి జంప్ కొట్టారు. అంతా చేసి ఈస్ట్ నుంచి పోటీచేయకుండా పరకాల నుంచి పోటీ చేశారు. గట్టి ఎదురుదెబ్బ తిన్నారు. పరకాలలో ఓటమితో సొంతగడ్డపై కొండాకు ఎంత బలముందో అందరికీ అర్థమైంది.

* కాంగ్రెస్ లోనూ కొండాది అదే శైలి..
పరకాల ఓటమితో అప్పటిదాకా దూకుడు మీదున్న కొండా ఫ్యామిలీకి ఒక్కసారిగా చుక్కెదురైంది. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చారు. గాంధీ భవన్ కు ఎప్పుడో ఒక్కసారి వచ్చే కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లోనూ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఇంటర్నల్ వార్ లో తలదూర్చే ప్రయత్నానికి తెరతీశారు. చివరకు పార్టీ పెద్దలు గట్టిగానే చెప్పడంతో సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందట.

ఇలా ఏ పార్టీలోనూ కొండా దంపతులు కుదురుగా ఉండరన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లైన్ ను దాటి వ్యవహరించడం, ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం వారికి అలవాటైపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించే స్థితి నుంచి చివరకు ఒక నియోజకవర్గం ఇస్తే చాలు అనుకునే స్థితికి కొండా దంపతులు చేరుకున్నారు. కొండా ఫ్యామిలీకి ఒక్క టికెట్ దక్కడమే గగనం అనే పరిస్థితి వచ్చేసింది. ఇలా ఉంది కొండా దంపతుల రాజకీయం.

*ఈస్ట్ లో ఎర్రబెల్లిని ఢీకొట్టడం కష్టమే !
కొండా సురేఖ గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ క్యాడర్ కూడా ఉన్నారు. కానీ అక్కడ చల్లా ధర్మారెడ్డి జోరు మీద ఉండడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నారామె. వరంగల్ ఈస్ట్ పై దృష్టి సారించారు. కానీ ఇక్కడ రాజకీయం ఇప్పటికే చాలా హాట్ గా ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెమటలు పట్టిస్తున్నారు. టికెట్ రాకముందే ప్రజల్లోకి వెళ్తూ, వారి మన్ననలు పొందుతున్నారు. దీంతో ఎర్రబెల్లికి కాలం కలిసొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ ద్విముఖ పోటీలోకి కొండా సురేఖ ఎంటరవుతున్నారు. పరకాల నుంచి కాకుండా ఈస్ట్ నుంచి సురేఖ బరిలో ఉంటారని కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. దీంతో ద్విముఖ పోటీ కాస్తా త్రిముఖ పోటీకి చేరింది. పోటీ వరకు ఓకే కానీ కొండా సురేఖ విజేతగా నిలవడం దాదాపు అసాధ్యమే. ఆస్థాయిలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు దూసుకుపోతున్నారు.

కొండా స్వయంకృతాపరాధం! 

*పోటీలో క్లారిటే లేదు..!
పరకాల అని ఒకసారి చెబుతారు. భూపాలపల్లి నియోజకవర్గం తమదేనంటారు. చివరకు వరంగల్ ఈస్ట్ అని ప్రకటన చేస్తారు. ఏంటో ఈ కొండా దంపతుల రాజకీయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ప్రజల్లో వచ్చిన మంచిపేరును నిలబెట్టుకోలేక చివరకు ఒక నియోజకవర్గంలో టికెట్ సాధించుకోవడానికి కష్టపడుతున్నారు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి అని చెప్పడానికి కొండా దంపతులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

* కొండా గెలవడం అసాధ్యమంటున్న విశ్లేషకులు!
మొత్తానికి వరంగల్ ఈస్ట్ లో మాత్రం బీజేపీకి వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా కొండా సురేఖ మాత్రం గెలిచే పరిస్థితి లేదు. అలా అని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు అయినా కొండా సురేఖ గట్టి పోటీ ఇస్తారా అన్నది కూడా కష్టమే. అంటే కొండా మూడో ప్లేసులో ఉండే అవకాశముందని టాక్. అదే జరిగితే కొండా సురేఖ రాజకీయ జీవితం మరింత కష్టాల్లో పడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దిగజారిన కొండా ఫ్యామిలీ ఇమేజ్ పాతాళానికి పడిపోయే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకుల అంచనా. మరి ఇప్పటికైనా కొండా దంపతులు పద్ధతి మార్చుకుంటారా? కనీసం రెండో ప్లేసుకోసమైనా పోటీపడతారో లేదో ? చూడాలి .!