ఎన్టీఆర్‌ సరికొత్త సిక్స్‌ప్యాక్‌ లుక్

ఎన్టీఆర్‌ సరికొత్త సిక్స్‌ప్యాక్‌ లుక్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అంతర్జాతీయ ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌కు వ్యక్తిగత శారీరక శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం ఎన్టీఆర్‌ను సరికొత్త లుక్ లో ముస్తాబు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ న్యూలుక్‌ను స్టీవెన్స్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘ఇప్పటివరకు చూడని ఎన్టీఆర్‌ ఫొటో’ ఇది అంటూ వ్యాఖ్యానించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరంభీం పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసమే ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో కనిపించబోతున్నారు.ఎన్టీఆర్‌ సరికొత్త సిక్స్‌ప్యాక్‌ లుక్