బోనీ క‌పూర్ ఇంట్లో కరోనా పాజిటివ్

బోనీ క‌పూర్ ఇంట్లో కరోనా పాజిటివ్ముంబై: క‌రోనా మ‌హమ్మారి పేద‌, ధ‌నిక అనే భేదం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తుంది. మందులేని ఈ మ‌హ‌మ్మారి నుండి మ‌నం కాపాడుకోవాలి అంటే భౌతిక దూరంతో పాటు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి ఉంటుంది. అయితే సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తున్న క‌రోనా తాజాగా బోనీ క‌పూర్ ఇంట్లో క‌ల‌క‌లం రేపింది. బోని క‌పూర్ ఇంట్లో ప‌ని చేసే 23 ఏళ్ళ చ‌ర‌ణ్ సోహో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు.  అయితే ఆసుప‌త్రికి తీసుకెళ్ళి అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, క‌రోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే క్వారంటైన్‌కి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు అందిస్తున్నారు. ఈ విష‌యంపై మాట్లాడిన బోనీ.. త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఇంట్లో ప‌నిచేసే వారెవ‌‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని, గ‌త కొద్ది రోజులుగా అంద‌రం ఇంట్లోనే ఉంటున్నాం అని అన్నారు.  అలానే చ‌ర‌ణ్ కూడా త్వ‌ర‌గా కోలుకోవాలని దేవుడ‌ని ప్రార్ధిస్తున్నాను అంటూ బోని అన్నాడు.