ఎంసీ కేసులో నిందితునిపై కేసు నమోదు : ఏసీపీ
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : కేఎంసీలో పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యా యత్నం కేసులో నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. నిందుతునిపై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని చెప్పారు. బాధితురాలు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ కేసు నమోదు చేశామని అన్నారు. తదుపరి విచారణ అనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని అన్నారు. సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని అందరూ సంయవనం పాటించాలని ఆయన సూచించారు.