హిజాబ్ పై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు

హిజాబ్ పై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు

వరంగల్ టైమ్స్, బెంగళూరు : హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ను బ్యాన్ చేయాలని దాఖలైన పలు పిటీషన్లను కొట్టి పారేసింది. అయితే స్కూళ్లలో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని కోర్టు తెలిపింది. ఇటీవల ఉడిపి కాలేజీలో ఆరుగురు అమ్మాయిలు హిజాబ్ ధరించడం వల్ల వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఆ జిల్లాలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. హిజాబ్ ధారణ ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారమేమీ కాదు అని నేడు కోర్టు తేల్చిచెప్పింది.హిజాబ్ పై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పువిద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ అంశంపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో హిజాబ్ పై విధించిన బ్యాన్ ను కోర్టు సమర్థించింది. యూనిఫాంను ధరించడమనేది ప్రాథమిక హక్కులకు భంగం కాదని, కేవలం ఆంక్ష మాత్రమే అవుతుందని కోర్టు తెల్పింది. జస్టిస్ రీతు రాజ్ అవాస్తీ నేడు కోర్టు తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 5న జారీ చేసిన ప్రభుత్వ జీవోను నిర్వీర్యం చేయడం లేదని కోర్టు చెప్పింది.